Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ వాంగ్మూలాన్ని పరీశీలించేందుకు బీసీసీఐకు సుప్రీం నిరాకరణ

ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ కు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ముందు భారత కెప్టెన్ ధోనీ, ఎన్.శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ సుందర్ రమణ్ లు ఇచ్చిన ఆడియో రికార్డులను బీసీసీఐ పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు బీసీసీఐ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ జేఎస్ ఖెహార్ ఆధ్వర్యంలోని బెంచ్ తీర్పునిచ్చింది. ఐపీఎల్ స్కాం కేసు తమ వద్దకు విచారణకు వస్తే ఆ ఆడియో రికార్డింగులను తామే తీసుకుని పరీశీలిస్తామని బీసీసీఐ న్యాయవాదులకు చెప్పారు. అనంతర విచారణను 16కు వాయిదా వేసింది.

More Telugu News